92. అల్-లైల్
1క్రమ్ముకునే రాత్రి సాక్షిగా
2ప్రకాశించే పగటి సాక్షిగా
3మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
4వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి
5కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో
6మరియు మంచిని నమ్ముతాడో
7అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము
8కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో
9మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో
10అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము
11మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది
12నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని
13మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది
14కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను
15పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు
16ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో
17కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు
18అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో
19కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక
20కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే
21మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath