89. అల్-ఫజ్ర్
1ప్రాంతః కాలం సాక్షిగా
2పది రాత్రుల సాక్షిగా
3సరి బేసీల సాక్షిగా
4గడచిపోయే రాత్రి సాక్షిగా
5వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి
6నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
7ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల
8వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు
9మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల
10మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల
11వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు
12మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు
13కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు
14వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)
15అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు
16కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు
17అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు
18మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు
19మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు
20మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు
21అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు
22మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు
23ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ
24అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
25అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు
26మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు
27(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా
28నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై
29నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో
30మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath