84. అల్-ఇన్షిఖాక్
1ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు
2మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
3మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు
4మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు
5అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
6ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు
7అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి
8అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు
9మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు
10ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు
11అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు
12మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు
13వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు
14వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు
15అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు
16కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను
17రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా
18పూర్ణచంద్రుని సాక్షిగా
19మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది
20అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు
21మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు
22అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు
23మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
24కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు
25విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath