ఇస్లాం
వెనక్కి

81. అట్-తక్వీర్

1సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు

2మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు

3మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు

4మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు

5మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు

6మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు

7మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు

8మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు

9ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని

10మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు

11మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు

12మరియు నరకాగ్ని మండించబడినప్పుడు

13మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు

14ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది

15అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను

16(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో

17మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా

18మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా

19నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు

20అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు

21అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు

22మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు

23మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు

24మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు

25మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు

26మరి మీరు ఎటు పోతున్నారు

27ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం

28మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు

29మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath