ఇస్లాం
వెనక్కి

80. అబాస

1అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు

2ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని

3కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు

4లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు

5కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో

6అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు

7ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది

8కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో

9మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో

10అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు

11అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం

12కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు

13ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది)

14మహోన్నతమైనది, పవిత్రమైనది

15లేఖకుల (దేవదూతల) చేతులలో

16వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు)

17మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు

18ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు

19అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు

20ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు

21ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు

22మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు

23అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు

24ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి

25నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము

26ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో

27తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము

28మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను

29మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను

30మరియు దట్టమైన తోటలను

31మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను

32మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా

33ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో

34ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు

35మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి

36మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి

37ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది

38ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి

39అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి

40మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి

41అవి నల్లగా మాడిపోయి ఉంటాయి

42అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath