78. అన్న-నాబా
1ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు
2ఆ మహా వార్తను గురించేనా
3దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో
4అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు
5ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు
6ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా
7మరియు పర్వతాలను మేకులుగా
8మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము
9మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము
10మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము
11మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము
12మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము
13మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము
14మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము
15దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి
16మరియు దట్టమైన తోటలను
17నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం
18ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
19మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి
20మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి
21నిశ్చయంగా, నరకం ఒక మాటు
22ధిక్కారుల గమ్యస్థానం
23అందులో వారు యుగాల తరబడి ఉంటారు
24అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు
25సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
26(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
27వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
28పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు
29మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము
30కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము
31నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది
32ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ
33మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు
34మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
35అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు
36(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం
37భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు
38ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు
39అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి
40నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath