77. అల్-ముర్సలాత్
1ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా
2మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా
3మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా
4మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా
5సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా
6సాకుగా లేక హెచ్చరికగా
7నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది
8అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో
9మరియు ఆకాశం చీలిపోతుందో
10మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో
11మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో
12ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి
13ఆ తీర్పుదినం కొరకా
14మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు
15ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది
16ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా
17తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము
18ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము
19ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
20ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా
21తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము
22ఒక నిర్ణీత కాలం వరకు
23ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము
24ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
25ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా
26జీవులకూ మరియు మృతులకూను
27మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా
28ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
29(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి
30(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి
31కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు
32వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది
33వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి
34ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
35ఆ దినాన వారు మాట్లాడలేరు
36మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు
37ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
38అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము
39కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి
40ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
41నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు
42మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి
43(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి
44నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
45ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
46(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు
47ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
48మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు
49ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
50దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath