ఇస్లాం
వెనక్కి

75. అల్-కియామా

1అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను

2అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను

3ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా

4వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము

5అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు

6అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు

7కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు

8మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు

9మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు

10మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు

11అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు

12ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది

13ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది

14అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు

15మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే

16నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు

17నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే

18కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు

19ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే

20అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు

21మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు

22ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి

23తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి

24మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి

25నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి

26అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు

27మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది

28మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు

29మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది

30ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది

31కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు

32మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు

33ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు

34(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది

35అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది

36ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా

37ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా

38తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు

39ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు

40అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath