ఇస్లాం
వెనక్కి

74. అల్-ముద్దత్తీర్

1ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా

2లే! ఇక హెచ్చరించు

3మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)

4మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో

5మరియు మాలిన్యానికి దూరంగా ఉండు

6మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)

7మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు

8మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు

9ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది

10సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు

11వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ

12మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను

13మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను

14మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను

15అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు

16అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు

17నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను

18వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు

19కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి

20అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి

21అప్పుడు అతడు ఆలోచించాడు

22తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు)

23తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు

24అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే

25ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే

26త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను

27మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు

28అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు

29అది మానవుణ్ణి (అతడి చర్మాన్నిదహించి వేస్తుంది)

30దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు

31మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే

32అలా కాదు! చంద్రుని సాక్షిగా

33గడిచిపోయే రాత్రి సాక్షిగా

34ప్రకాశించే, ఉదయం సాక్షిగా

35నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం

36మానవునికి ఒక హెచ్చరిక

37మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి

38ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు

39కుడిపక్షం వారు తప్ప

40వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు

41అపరాధులను గురించి (మరియు వారితో అంటారు)

42మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది

43వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము

44మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము

45మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము

46మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము

47చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది

48అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు

49అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు

50వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది

51సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)

52అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు

53కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు

54అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం

55కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు

56కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath