క్రైస్తవం
వెనక్కి

సంఖ్యాకాండం 2

1యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.

2“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.

3యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.

4యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.

5యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.

6నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు.

7ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.

8అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు.

9యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.

10దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.

11అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.

12రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.

13అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.

14తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.

15అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.

16కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.

17సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.

18ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.

19ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.

20మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.

21అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.

22మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.

23అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.

24కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.

25దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.

26దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.

27అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.

28అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.

29ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.

30నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు.

31కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.”

32ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.

33అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.

34ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath