క్రైస్తవం
వెనక్కి

సంఖ్యాకాండం 28

1యెహోవా మోషేతో మాట్లాడుతూ,

2“నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి.

3ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు. మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతి రోజూ ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న రెండు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.

4వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయాన, రెండోదాన్ని సాయంకాలం అర్పించాలి.

5మెత్తగా దంచిన ఒక కిలో పిండిని ఒక లీటరు నూనెతో కలిపి పదోవంతు నైవేద్యంగా అర్పించాలి.

6అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.

7ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించాల్సిన పానార్పణ ముప్పావు లీటరు. పవిత్రస్థలంలో యెహోవాకు మద్యం పానార్పణగా పొయ్యాలి.

8ఉదయ నైవేద్యం, దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా ఆ రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి.

9విశ్రాంతి రోజున ఒక సంవత్సరం వయస్సు ఉండి, ఏ దోషం లేని రెండు గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు అర్పించాలి.

10నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి.

11ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో

12నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో మూడు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో ఒక్క పదో వంతు నైవేద్యంగా అర్పించాలి.

13అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలి.

14వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో ఒక లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో ఒక లీటరు, గొర్రెపిల్లతో ముప్పావు లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతినెలా జరగాల్సిన దహనబలి.

15నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా ఒక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పించాలి.

16మొదటి నెల 14 వ రోజు యెహోవా పస్కాపండగ వస్తుంది.

17ఆ నెల 15 వ రోజు పండగ జరుగుతుంది. ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి.

18మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.

19అయితే, యెహోవాకు దహనబలిగా మీరు రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలు అర్పించాలి. అవి మీ మందల్లో ఏ దోషం లేనివిగా ఉండాలి.

20వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి.

21ఒక్కొక్క దున్నపోతుతో నూనెతో కలిపిన ఆరు లీటర్ల మెత్తని పిండి, పొట్టేలుతో నూనెతో కలిపిన నాలుగు లీటర్ల మెత్తని పిండి, ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన రెండు లీటర్ల మెత్తని పిండి అర్పించాలి.

22మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి.

23ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.

24ఆ విధంగానే, ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే పదార్థం ఆహారంగా అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి, దాని పానార్పణ కాకుండా దాన్ని కూడా అర్పించాలి.

25ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.

26ఇంకా, ప్రథమ ఫలాలు అర్పించే రోజు, అంటే, వారాల పండగరోజు మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పవిత్ర సంఘంగా సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.

27యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలిగా మీరు రెండు దున్నపోతు దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి దున్నపోతు దూడతో

28నూనెతో కలిపిన ఆరు కిలోల మెత్తని పిండిలో మూడు పదో వంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదో వంతులు,

29ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదో వంతు,

30మీ కోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ఒక మేకపిల్ల, అర్పించాలి.

31నిత్యం జరిగే దహనబలి, దాని నైవేద్యం కాకుండా వాటినీ, వాటి పానార్పణను అర్పించాలి. అవి ఏ దోషం లేనివిగా ఉండాలి.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath