క్రైస్తవం
వెనక్కి

లేవీకాండం 4

1యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు.

2“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.

3నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.

4అతడు ఆ కోడెని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. ఆ కోడె తలపైన తన చెయ్యి ఉంచి, తరువాత యెహోవా ఎదుట దాన్ని వధించాలి.

5అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారానికి తీసుకు రావాలి.

6తరువాత ఆ యాజకుడు తన వేలు ఆ రక్తంలో ముంచి అతి పరిశుద్ధ స్థలం తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి.

7తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

8తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.

9అలాగే దాని రెండు మూత్ర పిండాలనూ, వాటిపై పేరుకుని ఉన్న కొవ్వునూ, దాని మూత్రపిండాలకు దగ్గర కాలేయం పైన ఉన్న కొవ్వునూ కోసి వేరు చేయాలి.

10శాంతిబలి కోసం వధించే ఎద్దు నుండి తీసినట్టే యాజకుడు దీని నుండి కూడా తీయాలి. తరువాత యాజకుడు వీటిని దహన బలిపీఠం పైన దహించాలి.

11అతడు ఆ కోడె దూడలో ఇంకా మిగిలి ఉన్న భాగాలైన దాని చర్మం, మాంసం, తల, కాళ్ళు, దాని అంతర్భాగాలూ, పేడ, మిగిలిన భాగాలన్నిటినీ శిబిరం బయటకు తీసుకుపోవాలి.

12బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెల పైన వాటిని దహించాలి.

13ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే

14తరువాత వారు చేసిన పాపం వారికి తెలిసినప్పుడు, సమాజం ఒక కోడెదూడని పాపం కోసం బలిగా అర్పించాలి. దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి.

15సమాజానికి పెద్దలుగా ఉన్నవాళ్ళు యెహోవా సమక్షంలో దాని తలపై తమ చేతులుంచాలి. ఆ తరువాత యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి.

16అప్పుడు అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలి.

17తరువాత యాజకుడు ఆ రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.

18తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాలి.

19తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి.

20ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికీ చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది.

21ఆ కోడెను శిబిరం బయటకు తీసుకుని వెళ్ళి మొదటి కోడెను దహించినట్టుగానే దీన్నీ దహించాలి. ఇది సమాజ పాపం కోసం చేసే బలి అర్పణ.

22ఒక అధికారి పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.

23తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.

24అతడు ఆ మేక తలపై చెయ్యి ఉంచి దాన్ని యెహోవా సమక్షంలో దహనబలి అర్పించే చోట వధించాలి. ఇది పాపం కోసం చేసే బలి.

25పాపం కోసం వధించిన దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

26దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.

27సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.

28తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక ఆడ మేకను బలి అర్పణగా తీసుకుని రావాలి. ఆ మేక లోపం లేనిదై ఉండాలి.

29పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.

30దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

31తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.

32ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకు రావాలి.

33అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.

34అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

35తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath