క్రైస్తవం
వెనక్కి

1 దినవృత్తాంతాలు 3

1దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.

2మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.

3అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.

4ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు. యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

5యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.

6దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,

7నోగహు, నెపెగు, యాఫీయ,

8ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.

9వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.

10సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.

11యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.

12యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.

13యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.

14మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.

15యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.

16యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.

17యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,

18మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.

19పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.

20అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.

21హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.

22షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.

23నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.

24ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath